మహేష్ కామెంట్స్ పై పూనమ్ రియాక్షన్.. !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ మధ్య వార్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా పూనమ్ కౌర్ పవన్ కు ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ట్వీట్ చేసిన కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం మరింత చర్చకు దారితీస్తోంది.

తనను ఈ వివాదం నుంచి కాపాడాలని పవన్ కళ్యాణ్ కు పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. పవన్ స్పందిస్తే… తన కెరీర్, తన కుటుంబాన్ని, తన మర్యాదను కాపాడినవరావుతారని, కొందరు(కత్తి మహేష్) రహస్య ఎజెండా పెట్టుకుని మాట్లాడుతున్నారని పవన్ కు పూనం ట్వీట్ చేసింది. తాను రాజకీయం గా టార్గెట్ కాదలుచుకోలేదని,ఇదే విషయం పై స్వయంగా వచ్చి మీతో మాట్లాడుతానంటూ ట్వీట్ లో పేర్కొంది.

అయితే కాసేపటికే ఆ ట్వీట్ ను పూనమ్ కౌర్ డిలీట్ చేశారు.