‘అజ్ఝాతవాసి’కి ఓ బ్యాడ్ న్యూ.. ఓ గుడ్ న్యూస్ !
‘అజ్ఝాతవాసి’ టైమొచ్చింది. ఇప్పటికే యుఎస్’లో ప్రీమియర్ షోస్ పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘అజ్ఝాతవాసి’ పరిస్థితి డిఫరెంట్’గా ఉంది. ‘అజ్ఝాతవాసి’కి ఏపీలో దొరికినంత స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రంలో దొరకలేదు. అక్కడ వారం రోజుల పాటు రాత్రి 1గం॥ల నుంచి ఉ॥10గం॥ల వరకు స్పెషల్ షోస్ వేసుకొనేందుకు అనుమతి దొరికింది. ఇక, తెలంగాణలో అనుమతి లభించిందనుకొన్న ప్రీమియర్ షోస్ లు క్యాన్సిల్ అయ్యాయి.
ఈ ఉదయం హైదరాబాద్’లో ‘అజ్ఝాతవాసి’ ప్రీమియర్ షో కోసం టికెట్స్ విక్రయించిన థియేటర్స్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అజ్జాతవాసి ప్రీమియర్ షోస్ కు అనుమతిని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో చిత్రబృందం మంత్రి తలసాని, పోలీసులతో జరిపిన చర్చలు ఫలితానిచ్చాయి. చివరకు వారం రోజుల పాటు అజ్ఝాతవాసి చిత్రాన్ని 5 షోస్ కు అనుమతి లభించింది. అది కూడా ఉదయం 8గం॥లకు మాత్రమే. దీంతో.. ఈరోజు రాత్రియే పడిపోవాల్సిన ప్రీమియర్ షోస్ రేపు.. ఉదయం 8గం॥లని పడనున్నాయి. ఈ లెక్కన అజ్ఝాతవాసికి తెలంగాణలో ఓ బ్యాడ్ న్యూస్.. ఓ గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు.
పవన్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అజ్ఝాతవాసి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అజ్ఝాతవాసి హవా మొదలైపోయింది. హాలీవుడ్ సినిమాలని కాదని ‘అజ్ఝాతవాసి’ని చూసేందుకు
ఓవర్సీస్ ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.