అజ్ఝాతవాసి (దుబాయ్) రివ్యూ

అజ్ఝాతవాసి.. ఓ అద్భుతం !

దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని ‘అజ్ఝాతవాసి’ చూపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అజ్ఝాతవాసి’ ప్రేక్షకుల ముందుకు వచ్చే టైమొచ్చింది. యుఎస్, తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ) కొన్ని చోట్ల ప్రీమియర్ షోస్ పడిపోనున్నాయి. అంతకంటే ముందే ‘అజ్ఝాతవాసి’ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు, సెన్సార్ బోర్డు ఉమైర్ సంధు ‘అజ్ఝాతవాసి’ రివ్యూని అందజేశాడు.

పవన్ – త్రివిక్రమ్’లు కలిసి సినిమా ఓ రేంజ్’లో ఉంటుందని తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఐతే, ‘అజ్ఝాతవాసి’ అంతకుమించిన స్థాయిలో ఉందట. ఫస్టాప్, సెకాంఢాప్ దేనికదే ప్రత్యేకమని చెబుతున్నాడు ఉమైర్. త్రివిక్రమ్ సినిమాలో తనలోని దర్శకుడు కంటే రచయితకే ఎక్కువ మార్కులు పడుతుంటాయి. ఐతే, ఈసారి డైరెక్షన్ కూడా అదిరిపోయిందట. యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ నిలుస్తాయని చెబుతున్నాడు.

త్రివిక్రమ్ ఆడియో వేడుకలో చెప్పినట్టుగా సినిమాలో పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూపించాడట. మొత్తంగా వన్ మేన్ షో చేశాడు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ సీన్స్ లోనూ అదరగొట్టాడు. దీనికితోడు హీరోయిన్స్ గ్లామర్, కుష్బూ నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. పాటలు కాస్త బోర్ కొట్టించిన పవన్ క్రేజ్ ముందు అవి పెద్ద మైనస్ అనిపించవని చెబుతున్నాడు. మొత్తానికి.. ‘అజ్ఝాతవాసి’ బ్లాక్ బస్టర్ హిట్ అని దుబాయ్ నుంచి రివ్యూ అందించారు ఉమైర్ సంధు. ఇప్పుడీ రివ్యూ పవర్ స్టార్ ప్రేక్షకులని ఖుషి చేస్తోంది.

గతంలోనూ క్రేజీ తెలుగు సినిమాలకు ఉమైర్ సంధు ఓ రోజు ముందుగానే రివ్యూ అందజేశాడు. ఆయన ఇచ్చిన రివ్యూ అక్షరాల నిజం అని కూడ చెప్పలేం. ఆయన అంచనాలు తప్పిన సందర్భాలున్నాయి. ఆయన చెప్పినట్టు సినిమా ఫలితం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. ఈ రివ్యూని ప్రామాణికంగా తీసుకొని సినిమా జడ్జ్ చేయవద్దని కోరుతున్నాం. అసలు, సిసలు రివ్యూని మరికొద్ది సేపట్లో మీ ముందు ఉంచుతుంది.. మీ టీఎస్ (తెలంగాణ)మిర్చి డాట్ కామ్.