ఇక ప‌వ‌న్ యాత్ర షురూ.. !

కొండ‌గట్టు నుంచి త‌న రాజ‌కీయ యాత్ర ప్రారంభిస్తాన‌న్న జ‌న సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న షెడ్యూలును ప్ర‌క‌టించారు. సోమ‌వారం రోజున కొండ‌గ‌ట్టుకు వెళ్లి స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. అనంత‌రం ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పారు. అయితే ఈ యాత్ర ఎలా కొన‌సాగుతుంది. అక్క‌డ నుంచి ఎక్కడెక్క‌డికి ఎలా వెళ‌తార‌నే దానిపై త‌న అభిమానులు, పార్టీ ముఖ్యుల‌తో చ‌ర్చించిన త‌రువాత నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పారు ప‌వ‌న్.

పాద‌యాత్ర ద్వారా నా, లేక బ‌స్సు యాత్ర తో జ‌నంలోకి వెళ్లాలా అనే దానిపై సోమ‌వారం లోగా క్లారిటీ ఇవ్వ‌నున్నారు. అయితే పాద‌యాత్రతో జ‌నంలో క‌లిసిపోయే అవ‌కాశం ఉండ‌ద‌ని, స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డం సాద్యం కాద‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో మూడు రోజుల ప‌ర్య‌టిస్తారు. త‌న ఇష్ట దైవాన్ని ద‌ర్శించుకున్న త‌రువాత‌, అవ‌స‌రం ఉన్న చోట పాద‌యాత్ర‌, అవ‌కాశం లేని చోట బ‌స్సు యాత్ర ద్వారా ముందుకెళ్లాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. మూడు రోజుల యాత్ర త‌రువాత త‌దుప‌రి షెడ్యూల్ ను నిర్ణ‌యించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ద‌మొత్తం మీద ప‌వ‌న్ యాత్ర తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి పెంచుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు చాలామంది.