హలో.. నష్టాల లెక్క తేలింది !

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని – ప్రియదర్శి జంటగా “హలో” సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తనయుడి కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాడు నాగార్జున. దీనికితోడు రిలీజ్’కు ముందు చేసిన ప్రమోషన్స్ తో ‘హలో’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 32 కోట్లకు అమ్ముడు పోయాయి.

హిట్ టాక్ తెచ్చుకొన్న ‘హాలో’కు చివరకు నష్టాలు తప్పలేదు. ఫైనల్’గా హలో రూ. 19.6కోట్లని మాత్రమే రాబట్టింది. దీంతో.. రూ. 11కోట్ల నష్టం వచ్చినట్టు లెక్కతేలింది. ఈ సినిమా క్లాస్ ప్రేక్షకులకి మాత్రమే కనెక్ట్ అయ్యింది. మాస్ ప్రేక్షకులని ఆకట్టుకోకపోవడం పెద్ద మైనస్ గా మారింది. రిలీజ్ ముందు చేసిన హడావుడిని రిలీజ్ తర్వాత చేయలేదు నాగార్జున. ఆ ఎఫెక్ట్ కూడా కలెక్షన్స్ పై పడింది. ఫైనల్ గా అఖిల్ ఖాతాలో మరో ప్లాప్ పడింది.

ఈ నేపథ్యంలోనే అఖిల్ తన మూడో సినిమాని పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నట్టు సమాచారమ్. లిస్టులో బోయపాటి, సుకుమార్, కొరటాల శివ తదితరుల పేర్లు వినబడుతున్నాయి. మరీ.. హ్యాట్రిక్ చిత్రమైన అఖిల్ కి కమర్షియల్ హిట్ ఇస్తుందేమో చూడాలి.