పవన్ కోసం సంపూ ఒక్కడే.. !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రని మొదలెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా చెప్పినట్టుగానే కొండగట్టు నుంచి ఆయన రాజకీయ యాత్రని స్టార్ట్ చేశారు. ఐతే, పవన్ యాత్రకు ఇప్పటి వరకు సినీ, రాజకీయవర్గాల నుంచి ఎలాంటి సపోర్టు లభించకపోవడం గమన్హారం. అదే సమయంలో పవన్ యాత్రని ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ కూడా పెద్దగా వ్యతిరేకించడం లేదు.

ఇక, పవన్ యాత్రలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హైలైట్ అయ్యారు. ఇండస్ట్రీలో చాలా మంది పవన్ ను వాడుకొన్నారు. కొందరు యంగ్ హీరోలు తమ సినిమాల్లో పవన్ జపం చేసి లబ్ధిపొందుతుంటారు. అలాంటి వారు ఎవ్వరు కూడా, మెగా యంగ్ హీరోలతో పాటు పవన్ యాత్రకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సపోర్టు తెలపలేదు. ఒక్క సంపూర్ణేష్ బాబు మాత్రం నేరుగా వెళ్లి పవన్ ను కలిసి మద్దతు తెలిపారు.

వాస్తవానికి సిద్ధపేట దగ్గర రఘునాథ పల్లి దగ్గరే పవన్ ను కలిసేందుకు సంపూ ప్రయత్నించారు. ఐతే, ఆ సమయంలో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వీలు కాలేదు. దీంతో.. ఆయన నేరుగా పవన్ కరీంనగర్ లో బస చేసిన స్వేతా హోటల్ కు వెళ్లి పవన్ కలిశారు. మొత్తానికి.. ఇండస్ట్రీ నుంచి పవన్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నది సంపూ ఒక్కడే అన్నది స్పష్టమవుతోంది.. !