‘రంగస్థలం 1985’ కథ ఇదే.. !

సుకుమార్ – రామ్ చరణ్’ల కలయికలో “రంగస్థలం 1985” సినిమా రెడీ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న అచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది. చరణ్ సరసన సమంత జతకట్టనుంది. ఇప్పుడీ సినిమా కథ ఇదేనంటూ.. ఓ స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కథ సారాంశం ఏమిటంటే.. ?

చిట్టిబాబు (రామ్ చరణ్) తండ్రి (రాజీవ్ కనకాల) ..ఓ వర్గానికి నాయకుడు. వర్గ విభేదాల కారణంగా చిట్టిబాబు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. తన తండ్రిని మట్టుబెట్టిన వారెవరు ? వారి భరతం పట్టడమే సినిమా కథని చెబుతున్నారు. పగ, ప్రతీకారం అంశాల మధ్యలో సమంత, రామ్ చరణ్ మధ్య ప్రేమకథ ఏపీసోడ్ ఆకట్టుకొనే ఉండనుంది. వీరి మధ్య రొమాన్స్ సినిమాకే హైలైట్ కానుందని చెబుతున్నారు. సినిమాలో సమంత లక్ష్మీ పాత్రలో కనిపించనుంది. హాట్ యాంకర్ అనసూయ రోల్ ఏంటన్నది లీకైన కథలో స్పష్టత ఇవ్వలేదు.

ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. [one_half last=last]