యాదాద్రి హుండీ లెక్కింపులో మహిళా చేతివాటం

యాదాద్రి హుండీ లెక్కింపులో ఓ మహిళా ఉద్యోగి చేతివాటం ప్రదర్శించింది. హుండీ ఆదాయం లెక్కింపులో పాల్గొన్న ఆమె రూ.22,280ల నగదును తీసి దాచుకుంది. ఈ వ్యవహారం ఆలయ సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. దీంతో ఆమెను అక్కడికక్కడే విధులనుంచి సస్పెండ్‌ చేసి పోలీసులకు అప్పగించారు.

ఈ లెక్కింపు విధులు నిర్వహించిన దేవస్థాన జూనియర్‌ అసిస్టెంట్‌ కె.సరోజ హుండీల్లోని నగదును లెక్కిస్తూ కొన్ని నోట్లను దుస్తుల్లో పెట్టుకుంది. తర్వాత ఆమె హుండీ లెక్కింపు జరుగుతున్న బాలాలయం నుంచి మధ్యలో బయటకు వెళ్తుండగా అనుమానంతో ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది మహిళా హోంగార్డులతో తనిఖీ చేయించారు. ఆమె వద్ద రూ.27, 280 విలువగల 6 రెండు వేల నోట్లు, 30 అయిదు వందల నోట్లు, 1 యాబై, 1 ఇరవై, 1 పది రూపాయల నోట్లు లభ్యమయ్యాయి. వెంటనే ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.