గజల్స్’కు బెయిల్ మంజూరు

గలీజ్ పని చేసి అరెస్టయిన గజల్ శ్రీనివాస్’కు ఎట్టకేలకు బెయిల్ మంజూరయ్యింది. ఆయన లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి కొన్నాళ్లుగా రిమాండ్ ఖైదీగా జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, గజల్స్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. రూ. పది వేలు, ఇద్దరు పూచీకత్తుతో బెయిలు మంజూరు చేసింది. ప్రతి ఆది, బుధ వారాలలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు షరతు విధించింది.

తన కార్యాలయంలో పని చేసే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులోబెయిల్ కోసం గజల్స్ రెండ్ సార్లు పెట్టుకొన్న పిటిషన్స్ ని కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఏ2 నిందితురాలు ఉన్న పని మనిషి పార్వతీ పరారీలో ఉండటంతో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఐతే, తాజాగా, గజల్స్ కు షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది.