‘రంగస్థలం’ టీజర్ టాక్

రామ్ చరణ్ – సుకుమార్’ల కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం “రంగస్థలం”. మార్చి 30న ‘రంగస్థలం’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. టీజర్ వన్ మేన్ షో చేశాడు. చెవిటి వాడైన చిట్టిబాబు పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ టీజర్ ని కట్ చేశారు. ఊరమాసు లుక్కు.. అంతకుమించి నాటు లుక్కులతో అదరగొట్టాడు చరణ్.

“నా పేరు చిట్టిబాబండీ.. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్ వినబడతుందండీ.. మనకు సౌండ్ కనబడుతుందండీ. అందుకే అండీ ఊర్లో మనల్ని అందరు సౌండ్ ఇంజనీర్ అంటారు. మా ఊరు రంగస్థలం అంటూ టీజర్ ని ఆకట్టుకొనే కట్ చేశారు. టీజర్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సినిమా ఇక కన్నుల పండగే”

ఈ సినిమాలో చరణ్ సరసన సమంత జతకట్టనుంది. ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.