అఖిల్ ‘హలో’కు ఊహించని కష్టాలు

గత యేడాది ప్రేక్షకులకి ‘హలో’ చెప్పాడు అఖిల్ అక్కినేని. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొంది. కానీ, కమర్షియల్’గా హిట్ కాలేదు. ఇప్పుడీ సినిమా అనుకోని వివాదంలో పడింది. ఈ సినిమా నిర్మాతలు 50లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరాదికి చెందిన ఒక వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ కథకు ఒక ఫోన్ నంబర్’ను వాడారు.

ఆ నంబర్ ను ఇప్పుడు సినిమాపై ఫిర్యాదు చేసిన ఉత్తర భారతదేశంకు చెందిన వ్యక్తి వాడుతున్నాడు. ఈ సినిమా వచ్చిన దగ్గర నుంచి తనకు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి. దీంతో త్వీర క్షోభ అనుభవించానని అంటున్నాడు ఆ వ్యక్తి. అందుకే లాయర్ ద్వారా హలో నిర్మాతలకు నోటీసులు పంపించారు. 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు. మరీ.. ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందన్నది చూడాలి.