టీడీపీకి భాజాపా ఝులక్

ఏపీలో టీడీపీ పార్టీకి బీజేపీ సడన్ షాక్ ఇచ్చింది. వైసీపీలో గెలిచి మంత్రులుగా కొనసాగుతున్న వారంతా రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ డిమాండ్ చేశారు. ఏకంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంథ్రనాథ్ రెడ్డితో కలిసి విష్ణుకుమార్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించడం సంచలనంగా మారింది. “వైసీపీలో గెలిచి మంత్రులుగా కొనసాగుతున్న వారంతా రాజీనామా చేయాలి. లేదంటే పార్టీ ఫిరాయించి మంత్రులు కావచ్చంటే కొత్త చట్టమైనా తీసుకురావాలని విష్ణుకుమార్ డిమాండ్ చేశారు”.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో భాజాపా భాగస్వామిగా కొనసాగుతోంది. అలాంటిది భాజాపాకు చెందిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మంత్రులపై ఆరోపణలు చేయడం చాలా పెద్ద విషయం. మరీ.. ఈ విషయాన్ని టీడీపీ, భాజాపా అధిష్టానాలు ఎలా తీసుకొంటాయి అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. ఇది భాజాపాకు టీడీపీ పట్ల ఉన్న వ్యతిరేకతని స్పష్టం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, భాజాపా ఎమ్మెల్యే విష్ణు కుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీడీపీ వాదిస్తోంది. విష్ణుకుమార్ ఒక్కరే సరదాగా ప్రెస్ మీట్ పెట్టి ఉంటే అలానే అనుకొనేవారు. ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేతో కలిసి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టీ మరీ వైసీపీ నుంచి వచ్చి మంత్రులయిన వారిపై డిమాండ్ చేశారు. దీంతో పాటు.. విష్ణుకుమార్ ప్రశ్నించిన ఆ నలుగురు మంత్రులు రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అంటున్నారు. ఇక, మిగిలిన ఎమ్మెల్యేల సంగతి ఏంటీ ? అంటే వారి రాజీనామాలు స్వీకర్ పరిధిలో ఉన్నాయి. మేం, మీరు, ఎవరు కూడా ఏం చేయలేం, అసలు ప్రశ్నంచని లేం అంటున్నారు.