రంగస్థలం’ ఖాతాలోకి కోటీ వ్యూస్ !

సుకుమార్ – రామ్ చరణ్’లా ‘రంగస్థలం’ టీజర్ హవా చూపిస్తొంది. సినిమా చిట్టిబాబు పాత్రని పరిచయం చేస్తూ టీజర్’ని కట్ చేశారు. ఊరమాస్ లుక్, అంతకుమించి అద్భుత నటనతో అదరగొట్టాడు చరణ్. ఇప్పుడీ టీజర్ ఏకంగా కోటీ డిజిటల్ వ్యూస్ రాబ‌ట్టింది. విడుద‌లై 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే ఈ ఘనత సాధించింది.

యూ ట్యూబ్ నుంచి 18 ల‌క్ష‌ల వ్యూస్. రెండున్న‌ర ల‌క్ష‌ల లైక్స్ వచ్చాయి. ఇతర సోషల్ మీడియా మాధ్యల ద్వారా రంగస్థలం టీజర్ ఖాతాలో కి కోటీ వ్యూస్ వచ్చిపడ్దాయి. ఈ రెస్పాన్స్ తో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక, రంగస్థలం సినిమాని మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.