ఆ మేటరు.. కూడా కాపీ అయితే ఎలా వర్మ ?

దర్శకుడు రాంగోపాల్ వర్మ “సెక్స్ అండ్ ట్రూత్” (జి ఎస్ టీ) టైటైల్’లో ఓ వెబ్ సిరీస్’ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోర్న్ బేస్ డ్ వెబ్ షార్ట్ ఫిల్మ్ ని రిపబ్లిక్ డే సందర్భంగా శుక్రవారం రిలీజ్’కు ప్లాన్ చేశాడు వర్మ. ఐతే, ఇంతలోనే ఈ షార్ట్ ఫిల్మ్ పై కాపీ కాంప్లైంట్ అందింది.

‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ కథ నాదే అంటూ పి.జ‌య‌కుమార్ అనే వ్య‌క్తి కోర్టులో పిటిష‌న్ వేశాడు. ఈ పిటిష‌న్ విచారించిన కోర్టు వ‌ర్మ‌కు నోటీసులు జారీ చేసింది. ఈ స్క్రిప్ట్‌ను తాను 2015 ఏప్రిల్‌ 1న వర్మకు పంపా. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు ‘జీఎస్టీ’ చిత్రంగా మ‌లిచి విడుద‌ల చేస్తున్నాడ‌ని జయకుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు. వ‌ర్మ క‌నీసం క్రెడిట్స్ కూడా ఇవ్వ‌కుండా త‌న స్క్రిప్ట్‌ను ఉప‌యోగించుకున్నాడ‌ని జ‌య‌కుమార్ ఆరోపిస్తున్నారు.

మరోవైపు, ఈ షార్ట్ ఫిల్మ్ వ్యవహారంలో పలు జిల్లాల్లో వర్మపై మహిళా నేతలు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక, ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలని ఇష్టపడే మగ ప్రేక్షకులు వర్మపై సటైర్స్ వేస్తున్నారు. ఆ మేటరు కూడా కాపీ అయితే ఎలా వర్మ అంటూ కామెంట్స్ వదులుతున్నారు.