‘స్థానికత’ని సింపుల్’గా తేల్చేశాడు

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జోనల్, స్థానికత అంశాలు పెద్ద సమస్యలుగా మారాయి. వీటిపై క్లారిటీ రాకపోవడంతో ఉద్యోగ భర్తీ, తదితర నోటీఫికేషన్స్ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జోనల్, స్థానికతని త్వరగా తేల్చేయాలని ప్రభుత్వం యోచుస్తోంది. ఇప్పటికే జోనల్ వ్యవస్థపై ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా, స్థానికతపై ముఖ్యమంత్రి కేసీఆర్ సింపుల్ గా తేల్చేశారు. ఒక‌టి నుంచి 7వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివిన చోటే స్థానికంగా గుర్తించాల‌ని సీఎం సూచించారు.

రెవెన్యూ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్, స్థానికత అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగానే జ‌నాభా ప్ర‌తిపాదిక‌న జోన్ల విభ‌జ‌న ఉండాల‌ని, మ‌ల్టీ జోన‌ల్ వ్య‌వ‌స్థ ఉండ‌ద‌ని, ఒక్కో జోన్ లో 80 ల‌క్ష‌ల జ‌నాభా ఉండేలా చూసుకోవాల‌ని కేసీఆర్ అధికారులకు సూచించారు. కొత్త పాస్ పుస్త‌కాలు, ప‌హాణీల రూప‌క‌ల్ప‌న భూరికార్డుల ప్ర‌క్షాళ‌న , ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై సమీక్ష చేశారు. ప్ర‌తీ అంగుళం భూమికి ఎవ‌రు య‌జ‌మానో తేల్చాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశించారు.