ఈ యేడాది ప్రభాస్ నుంచి నిరాశే.. !

‘బాహుబలి తర్వాత పెళ్లి చేసుకొంటా. అన్న ప్రభాస్ పెళ్లి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ యేడాదైనా ఆయన పెళ్లి చేసుకొంటాడనే గ్యారెంటీ లేదు. ఇదిలానే కొనసాగితే కొన్నాళ్ల తర్వాత ప్రభాస్ ను టాలీవుడ్ సల్మాన్ ఖాన్ అని పిలవాల్సి వస్తుంది. పెళ్లి విషయం కాసేపు ప్రక్కన పెడితే.. ఈ యేడాది ప్రభాస్ నుంచి సినిమా కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదు.

దాదాపు రూ. 150కోట్ల బడ్జెట్’తో సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సాహో’ తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ జతకట్టనుంది. బాలీవుడ్, హాలీవుడ్’కు చెందిన పలువురు నటీనటులు, టెక్నీషన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. వచ్చేనెల చివరిలో దుబాయ్ వెళ్లనుంది చిత్రబృందం. దాదాపు రెండు నెలల పాటు అక్కడ షూటింగ్. దుబాయ్ ఏపీసోడ్ సినిమాకే హైలైట్ కానుందట. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయినట్టే.

ఇక, మిగిలిన 50 శాతం పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే లోపు ఈ యేడాది పూర్తవుతుందని చెబుతున్నారు. వచ్చే యేడాది జనవరిలోనే ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని చెప్పుకొంటున్నారు. బాబోయ్.. ప్రభాస్ సినిమా చూడ్డానికి మరో యేడాది పడుతుందా ? అంటూ ఆయన అభిమానులు నిరాపడే పరిస్థితి ఏర్పడనుంది. కానీ, తప్పదేమో !. ఈలోపు పెళ్లి చేసుకోనైనా అభిమానులని మురిపిస్తాడేమో చూడాలి.