కారు ప్రమాదంలో నాని

హీరో నాని కారు శనివారం హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబ‌రు 45లో ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయనతో పాటు, డ్రైవర్‌’కు ఎలాంటి గాయాలూ కాలేదు. కారు బెలూన్లు తెరచుకోవడంతో వీరిద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

షూటింగ్ పూర్తి చేసుకొని.. నాని, అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 45 మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు. ప్రోస్టు పబ్‌ సమీపంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ మీదకెక్కి డివైడర్‌ మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో విద్యుత్‌ స్తంభం నేలవాలింది. అనంతరం ఇంటి నుంచి మరో కారుని తెప్పించుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారమ్.