పద్మావత్ @50 కోట్లు !

భన్సాలీ ‘పద్మావత్’ కలెక్షన్స్ జోరందుకొన్నాయి. వివాదాలు, అడ్డంకుల మధ్య ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పద్మావత్’ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. ఐతే, కర్ణిసేన హెచ్చరికల ఎఫెక్ట్ తొలిరోజు కలెక్షన్స్ పై పడింది. ఇక, రెండో రోజు ప్రేక్షకులు ‘పద్మావత్’ కోసం క్యూ కట్టారు. దీంతో రెండు రోజుల్లోనే పద్మావత్ రూ. 50కోట్లు కలెక్ట్ చేసింది.

రిలీజ్’కు ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం. వివాదాల నేపథ్యంలో సినిమాని దక్కిన పబ్లిసిటీ పాజిటివ్ తో మరింత ప్లస్ కానుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టేలా కనిపిస్తుంది. సినిమాలో దీపిక పదుకొనే, రణ్ వీర్ సింగ్ ల నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.