‘ఇంటిలిజెంట్‌’ టీజర్ టాక్

దర్శకుడు వినాయక్‌ మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌’ని ‘ఇంటిలిజెంట్’గా చూపించబోతున్న సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఫిబ్రవరి 9 ‘ఇంటిలిజెంట్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈలోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా టీజర్ ప్రశంసలు అందుకొంటోంది.

ఈ సినిమా టీజర్’ని నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. “సినిమాలో హీరో పాత్ర ధర్మాభాయ్ పాత్రని పరిచయం చేస్తూ టీజర్ కట్ చేశారు. వన్ మేన్ షో అన్నమాట. యాక్షన్ అదిరిపోయేలా ఉంది. ‘ఇక మీదట పేదోడికి ఫ్లాట్ ఫామ్ ధర్మాభాయ్ ఫ్లాట్ ఫామ్’ డైలాగ్ బాగా పేలింది”. ఈ చిత్రానికి సంగీతం థమన్. సి.కల్యాణ్‌ నిర్మాత.