బాబోయ్.. మగ ‘జీఎస్టీ’ వచ్చేస్తోంది.. !!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసుకొచ్చిన జీఎస్టీ (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) వెబ్ సిరీస్ కు కౌంటర్ గా కాకినాడకు చెందిన సూర్య అకొండి అనే యువకుడు ‘జంట్స్ సెక్స్ అండ్ ట్రూత్’ తీసుకొస్తున్నాడు.

దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్, ట్రైలర్ ని కూడా వదిలాడు. వర్మ జీఎస్టీ తరహాలోనే ఇతను కూడా పోస్టర్, ట్రైలర్లు డిజైన్ చేయడం విశేషం. మియా మాల్కోవాను ప్రధాన ప్రచారాస్త్రంగా వర్మ వాడడంతో సూర్య… మేల్ పాల్కోవాను ప్రచారాస్త్రంగా వాడుకున్నాడు. మగ ‘జీఎస్టీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” టాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత అనేక సూప్ లు వచ్చేశాయ్. మహిళా ‘అర్జున్ రెడ్డి’ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో హల్ చల్ చేసింది. ఇప్పుడు వర్మ మగ ‘జీఎస్టీ’ ఎన్నో సంచలనాలకు తెరలేపుతుందనేది చూడాలి.