‘ఏపీ – సన్ రైజ్ స్టేట్’ ఎందుకో తెలుసా ?

తెలుగు రాష్టాల్లో ఒకట్రైన ఆంధ్రప్రదేష్ విషయంలో కొత్త నినాదం వినబడుతోంది. ఏపీని ‘సన్ రైజ్ స్టేట్’ అంటూ పిలుస్తున్నారు. దీనికి వెనక అసలు కథని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ‘ఆంధ్రప్రదేష్ రాష్ట్రం తూర్పు తీరంలో ఉండడంతో సూర్యుడు ఇక్కడి నుంచే ఉదయిస్తాడు. అందుకే ఈ రాష్ట్రానికి సూర్యుడే అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు అన్నారు. ఈ కారణంగానే “సన్ రైజ్ స్టేట్” అనే నినాదం ఇచిన్నట్టు క్లారిటీ ఇచ్చారు.

ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సూర్యారాధన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “సూర్యునికి అన్ని ప్రాంతాలు, మతాలలో ప్రాధాన్యత ఉంది. అరబ్ దేశాల్లో సూర్యుడ్ని షమ్స్ పేరుతో ఆరాధించే సంస్కృతి ఉంది. సూర్యారాధన, జలహారతి, అమ్మకు వందనం కార్యక్రమాలు ప్రకృతి ఆరాధనలో భాగమని” తెలిపారు. మొత్తానికి.. ఏపీకి అదిరిపోయే కొటినేషన్ ని సెట్ చేశాడు సీఎం చంద్రబాబు.