పవన్ అనంతను ఎంచుకోవడం వెనక !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ రంగంలోకి దిగాడు. ఇకపై పూర్తిస్థాయి రాజకీయాల్లో గడపనున్నాడు. ఐతే, ఏ పని ప్రారంభించిన ఆరంభం ముఖ్యమని చెబుతుంటారు. పవన్ పొలిటికల్ యాత్ర ప్రారంభం కాస్త ఆశ్చర్యానికే గురిచేసింది. ఆయన ఏపీపై ఫోకస్ చేస్తాడనుకొనుంటే.. అందుకు భిన్నంగా తెలంగాణ నుంచి తన పొలిటికల్ యాత్రని మొదలెట్టారు. దీనికి సెంటిమెంట్ కారణమని.. కొండగట్టు ఆంజనేయ స్వామిపై భారం వేశాడు.

తెలంగాణలో సరే.. మరీ ఏపీలో పవన్ అనంతపురం జిల్లాను ఎందుకు ఎంచుకొన్నట్టు ? వచ్చే సాధారణ ఎన్నికల్లో పవన్ అనంతపురం నుంచి అది కూడా ప్రస్తుతం బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతాడనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ అనంతని ఎంచుకొని ఉంటాడనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐతే, కదిరి పర్యటనలో పవన్ అనంతని ఎంచుకోవడం వెనక అసలు కారణం బయటపెట్టారు.

“తాను ప్రతికూల పరిస్థితుల నుంచి పైకి వచ్చా. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కష్టాలు ఎక్కడ ఉంటాయో, పరిష్కారం కూడా అక్కడే ఉంటుందని తాను బాలంగా నమ్ముతా. ఇక్కడ కరువు పరిస్థితులు ఉన్నాయి. అక్షరాతస్యత కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అనంతపురాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది” అన్నారు పవన్.