కావాలని అలా చేయలేదు: కలెక్టర్ ఆమ్రపాలి
గణతంత్ర దినోత్స వ వేడుకల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ప్రసంగించిన తీరు వివాదాస్పదమైంది. పలు వార్తా ఛానల్లు, పత్రికలతో పాటు, సోషల్ మీడియాలో కూడా ఆమె ప్రసంగం వీడియోలు హల్ చల్ చేశాయి. దీంతో ప్రభుత్వం తరపు నుంచి కలెక్టర్ ఆమ్రపాలిని వివరణ కోరారాట సీఎస్ ఎస్పీసింగ్.
గణంతంత్ర దినోత్సవ ప్రసంగ సమయంలో తడబాటుపై ఆయన ఆరా తీశారట. ఈ విషయంపై కలెక్టర్ ఆమ్రపాలితో ఫోన్ లో మాట్లాడారు. పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను తప్పు చేయలేదని ఆమ్రపాలి వివరణ ఇచ్చింది.