అభిమానం ‘చెప్పు’తో కొట్టింది
మిల్కీబ్యూటీ తమన్నాకు హైదరాబాద్’లో ఘోర అవమానం ఎదురైంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలబర్ జువెలర్స్ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన తమ్మూని.. ఓ ఆకతాయి చెప్పుతో దాడి చేశాడు. అభిమానుల కోరికని కాదనలేఖ వారితో సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ఘటన జరిగింది.
తమ్మూపై దాడిచేసిన ఆకతాయిని పోలీసులు వెంటనే అదుపులోని తీసుకొన్నారు. ఐతే, తమ్మూపై బూటు విరసడానికి నిందితుడు చెప్పిన కారణం ఆశ్చర్యని కలిగిస్తోంది. అతని పేరు కరీముల్లా. హైదరాబాద్ ముషీరాబాద్ కుర్రోడు. తాను తమన్నాకు వీరాభిమానని, ఆమె నటించిన అన్ని సినిమాలు చూస్తా. ఇటీవల ఆమె తెలుగు సినిమాల్లో నటించడంలేదనే కోపంతో ఆమెపైకి బూటు విసిరానని చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇది తెలిసిన వాళ్లు అభిమానం చెప్పుతో కొట్టిందని చెప్పుకొంటున్నారు.