కేసీఆర్’పై రేవంత్ రెడ్డి ఎంత మాటా.. !

ముఖ్యమంత్రి కేసీఆర్’పై ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాటల దాడిని ఆపడం లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన రేవ్ంత్.. తిరిగి మొదలెట్టాడు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే..’క.చ.రా’ అంటూ కొత్త అర్థం చెప్పారు రేవంత్. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఎన్’డీఎస్ఎల్ కర్మాగారాల పునరుద్ధరణకు జరుగుతున్న రిలే దీక్షల్లో రేవంత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్’డీఎస్ ఎల్ కర్మాగారాలను నడిపించే శక్తి ప్రభుత్వానికి లేదా ? అంటూ ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ రేవంత్ వదల్లేదు. ‘గుడిబాట వీడి పొలంబాట’ పడితే క్షేత్ర స్థాయిలో సర్కారు పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని సెటైర్ వేశారు