నాని ‘అ’ విడుదల ఎప్పుడంటే ?
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి.. తన సొంత సంస్థ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ‘అ!’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. కాజల్, నిత్యామేనన్, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రశంసలు అందుకొన్నాయి. ఇపుడీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కూడా అయ్యింది.
సినిమా విడుదలను ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చిత్రబృందం ఓ వెరైటీ పోస్టర్’ను వదిలారు. “అన్ని సినిమాలందు ‘అ’ సినిమా వేరయా .. విశ్వదాభి రామా ఫిబ్రవరి 16 రిలీజ్ రా మామా” అంటూ తాళపత్రాల రూపంలో కొత్తగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడీ ‘అ’ రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.