అసలు నిందితుడు నాని ?!
నేచురల్ స్టార్ నాని కారు రిపబ్లిక్ డే నాడు తెల్లవారు జామున ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కేసి కరెంట్ పోన్ ని బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో బెలూన్స్ ఓపెన్ కావడం నాని, అతని కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్టు తెలిసింది. ఆ తర్వాత నాని ఇంటికి ఫోన్ చేసి వేరే కారులో వెళ్లిపోయారు. ఐతే, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారమ్.
బయటికి చెప్పుతున్నట్టు ప్రమాదం జరిగిన కారుని నానినే డ్రైవ్ చేశాడట. అసలు ఆ రోజు కారులో డ్రైవర్ కూడా లేరు. తెల్లవారుజామున షూటింగ్ ముగించుకొని ఇంటికి వస్తున్న నాని కారు ప్రమాదానికి గురైంది. వెంటనే ఇంటికి ఫోన్ చేసి డ్రైవర్ త్వరగా రమ్మన్నాడు నాని. డ్రైవర్ రాగానే విషయం అంతా అర్థమయ్యేలా చెప్పి మరో కారులో ఇంటికి వెళ్లిపోయాడు. నాని డ్రైవర్ ని కాస్త కటువుగా విచారిస్తే అసలు నిజం కక్కాడు. మరీ.. ఈ విషయంలో పోలీసులు డేర్ చేసి నానిపై చర్యలు తీసుకొంటారా ? లేదంటే నాని చెప్పినట్టు డ్రైవర్ తో సరిపెట్టుకొంటారా ?? అనేది చూడాలి.