ఢిల్లీలో భాజాపా-టీడీపీ పంచాయతీ !
ఆంధ్రప్రదేష్’లో భాజాపా, టీడీపీల మధ్య నెలకొన్న పంచాయితీ ఢిలీకి చేరింది. అక్కడ భాజాపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో ఈ పంచాయతీపై చర్చ జరగనుంది. నేడు బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ కానున్నట్టు టిడిపి కేంద్ర మంత్రి సుజనా తెలిపారు. ఐతే, ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీ భాజపా, టీడీపీ నేతల మధ్య నెలకొన్న పంచాయతీపైనే చర్చ జరగనున్నట్టు సమాచారమ్. అందుకే సుజనాతో పాటుగా మరికొందరు టీడీపీ నేతలు, ఏపీకి చెందిన భాజాపా నేతలు షాతో సమవేశం కానున్నారు.
ఏపీ భాజాపా నేతలు టీడీపీ మిత్రబంధంను పాటించలేడం లేదని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇక, ఏపీ భాజాపా ఎమ్మెల్యే ఏకంగా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రెస్ మీట్ పెట్టాడు. టీడీపీ ప్రభుత్వంలోని వైసీపీ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టెక్నికల్ గా ఇది మంచి డిమాండ్ నే. ఐతే, టీడీపీ ప్రభుత్వంలో ఉంటూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో కలసి ఇలాంటి డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.
టీడీపీతో కలిసి నడవడం ఏపీ భాజాపా నేతలకి అస్సలు ఇష్టం లేనట్టు కనబడుతోంది. మరోవైపు, వచ్చే సాధారణ ఎన్నికల అవసరం రీత్యా టీడీపీ మిత్రపక్షంగా కొనసాగించాలని భాజాపా అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి టీడీపీ-భాజాపా నేతల పంచాయతీ ఆసక్తికరంగా మారింది. మరీ.. అమిత్ షా ఏ తీర్పు చెబుతారు ? ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది చూడాలి.