‘టీఆర్టీ’ వాయిదాపై టీఎస్‌పీఎస్సీ క్లారిటీ

టీఆర్టీ (టీచర్‌ రిక్రూట్‌ మెంట్‌ టెస్ట్‌)ని వాయిదా వేయాలని, ఫిబ్రవరికి బదులుగా మే నెలలో పరీక్షని నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని విజ్ఝప్తిని చేసిన విద్యార్థులు, సోషల్ మీడియా వేదికగా టీఆర్టీ వాయిదా తమ విజ్ఝప్తికి ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో టీఆర్టీ కోసం ప్రిపేర్ అవుతున్న కొంతమంది విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడింది. ఇది గ్రహించిన టీఎస్‌పీఎస్సీ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

టీఆర్టీ పరీక్ష ముందుగా నిర్ణయించబడిన ఫిబ్రవరి నెలలోనే జరుగుతుంది. వాయిదా పడుతుందని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న న్యూస్ ని నమ్మొద్దని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. ఎట్టిపరిస్థితుల్లో ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తామని టీఆర్టీ నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు, విద్యార్థులు టీఆర్టీని మే నెల వరకు వాయిదా వేయించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మరీ.. చివరికి ఏం జరుగుతుందని చూడాలి.