ఆ కేసులో అమలా పాల్ అరెస్ట్.. !
హీరోయిన్ అమలా పాల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కొన్ని నెలలుగా పన్ను ఎగవేత విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. తప్పుడు చిరునామా పత్రాలు సృష్టించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు ఆమెపై కేరళలో కేసు నమోదైంది.
అమలాపాల్ గత ఏడాది రూ. కోటితో ఖరీదైన కారును కొన్నారు. దాన్ని తప్పుడు పత్రాలు ఉపయోగించి, పాండిచ్చేరిలో రిజిస్టర్ చేయించారు. కేరళలో రూ. 20 లక్షల పన్ను ఎగవేయాలని ఆమె ఇలా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తాజాగా అమలాపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె బెయిలుపై విడుదలైంది. అరెస్ట్, విడుదల సందర్భంగా అమలా మీడియాతో మాట్లాడలేదు.