కమల్’తో నయన్.. ఇదే తొలిసారి !

‘భారతీయుడు’ సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవలే దర్శకుడు శంకర్ తైవాన్’లో ప్రకటన కూడా చేశారు. “ఇండియన్‌ 2’ను త్వరలో స్టార్ట్‌ చేయబోతున్నట్లు ‘హీలియమ్‌ బెలూన్‌’ను ఆయన తైవాన్‌లో ఎగురవేశారు. ఆ బెలూన్‌పై ‘ఇందియన్‌ 2’ అని తమిళంలో ‘ఇండియన్‌ 2’ అని ఇంగ్లిష్‌లో రాసి ఉంది.

ఇప్పుడీ సీక్వెల్’కు సంబంధించిన పనులు మొదలయ్యాయి. హీరోయిన్’గా నయనతార పేరు వినిపిస్తొంది. కమల్ సినిమా కావడంతో ఆమె ఓకే చెప్పే అవకాశాలున్నాయి. కమల్’తో జతకట్టడం నయన్’కు ఇదే తొలిసారి. ఈ సీక్వెల్’కు ‘2.0’కి రచయితగా వ్యవహరించిన జయమోహన్‌ రచయిగా వ్యవహరించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.