సామ్రాట్ గురించి షాకింగ్ నిజాలు

భార్య ఫిర్యాదుతో టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిని మాదాపురం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ని ప్రస్తుతం చర్లపల్లి జైలుకి తరలించారు. ఇప్పుడీ నటుడు గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది.. ఆయన సతీమణి. సామ్రాట్ అరెస్ట్ తర్వాత ఆమె ఓ టీవీ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె భర్త చేసిన దుర్మార్ఘాలను తెలిపారు.

తన భర్త పెద్ద ఎదవ. డ్రగ్స్, హుక్కా అలవాట్లున్నాయి. ఆయన ఓ ‘గే’ కూడా. ఈ విషయం అతనికి, నాకు ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని చెప్పుకొచ్చింది. ఆయనకి ఇతర అమ్మాయిలతో సంబంధాలున్నాయి. బయటకు తీసుకెళ్లినప్పుడు మంచిగా చూసుకొంటున్నట్టు కటింగ్స్ ఇచ్చేవాడు. ఇంట్లోకి రాగానే టార్చర్ పెట్టేవాడు. ఖర్చులకు కావాల్సిన డబ్బుల కోసం తనతో ఉద్యోగం కూడా చేయించాడు. ఇంట్లో కూర్చుని డబ్బులకు వేధించేవాడు. ఎప్పటికైనా మారుతారన్న ఆశతో చాన్నాళ్లు ఎదురు చూశా. తన సేఫ్టీ కోసం తన తండ్రి సీసీటీవీ కెమెరాలను ఇంట్లో పెట్టించడం వల్లే, సామ్రాట్ పై
పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లభించిందని తెలిపింది. [one_third last=last]