పెళ్లి చూపులు నటుడుకి పెళ్లి చూపులు
విజయ్ దేవరకొండ “పెళ్లి చూపులు” సినిమాతో ఫేమస్ అయిపోయాడు కమెడియన్ ప్రియదర్శి. ఇప్పుడీ కమెడియన్ చేతినిండా సినిమాలున్నాయి. కెరీర్ లో బిజీగా ఉండగానే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టున్నాడు. ప్రస్తుతం పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటీవలే పెళ్లి చూపులు కూడా జరిగాయట.
అమ్మాయి నచ్చేసింది. ఆమె పేరు రిచా శర్మ. వీరి వివాహం ఫిబ్రవరి 23న హైదరాబాద్ లో జరగనుంది. 2017లో దాదాపు 14 సినిమాల్లో నటించాడు ప్రియదర్శి. ఈ యేడాది కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంతటీ బిజీలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు.