వరల్డ్ కప్’లో అశ్విన్, జడేజాల నిరాశే !

దక్షిణాఫ్రికా టూర్ భారత్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఛేదు అనుభవాన్ని మిగిల్చేలా ఉంది. అదేంటీ.. ? దక్షిణాఫ్రికా టూర్’లో వీరిద్దరు ఆడటం లేదుగా. ఇది నిజమే. ఐతే, దక్షిణాఫ్రికా టెస్ట్ 2019లో ఇక్కడే జరగనున్న వరల్డ్ కప్ – 2019 ని ప్రభావితం చేయనుంది.

తాజా టూర్’లో యువ స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ యాదవ్’లు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. వీరి రాణించడం వలనే 6 వన్ డేల సిరీస్ ని ఇప్పటికే 4-1తో సొంతం చేసుకొంది టీమిండియా. తమ మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారిన ఈ యువ స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ యాదవ్ లకు వరల్డ్ కప్ లో స్థానం పదిలమని చెబుతున్నారు. దీంతో.. సీనియర్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు నిరాశ తప్పదనే టాక్ ఇప్పటి నుంచే వినబడుతోంది.

ఐతే, ఈ యువ స్పిన్ ద్వయంలో ఏ ఒక్కరు గాయపడిన అశ్విన్, జడేజాకు చోటు లభించే ఛాన్స్ ఉంది. మరోవైపు, ఈ మధ్య అశ్విన్ తన పంతాను మార్చుకొన్నాడు. అతడు మణికట్టుతో మాయ చేయడం ప్రాక్టీసు చేస్తున్నాడు. ఒకవేళ ఈలోపు మణికట్టు మాయాజాలంలో అశ్విన్ రాటుదేలి.. దాన్ని నిరూపించుకోగలిగితే అశ్విన్ ని వరల్డ్ కప్ ఆడబోతున్న జట్టులో చూడొచ్చేమో.