మురళీ కృష్ణడిగా దర్శనమిచ్చిన యాదాద్రీశుడు..
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు స్వామివారు మురళీ కృష్ణుడుగా దర్శనమిచ్చారు. నిన్న మత్స్యావతారంతో ప్రారంభమైన అలంకార సేవలు ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ముగిసే నాటికి వివిధ రకాల అలంకారాలలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువును మత్య్స, శ్రీకృష్ణ, వటపత్రశాయి ఇలా మొత్తం 15రకాల అలంకారాలలో దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఒక్కోరోజు ఓక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మురళీకృష్ణుడుగా దర్శనమిస్తున్న స్వామివారి దివ్యమనోహర రూపాన్ని దర్శించుకుని భక్తులు పరవశించిపోతున్నారు. రాత్రి 9గంటలకు స్వామివారు హంసవాహనంపై ఆసీనులవుతారు. అర్చకులు హంసవాహన సేవతో స్వామివారికి సేవచేస్తారు.