ఎన్కౌంటర్ పై హైకోర్టు తీర్పు.. !
శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ పై తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. మృతదేహాలను వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అయితే భద్రాచలంలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
పోస్ట్ పార్ట్ మొత్తం వీడియో చిత్రీకరణ చేయాలని, ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఇద్దరు సీనియర్ డాక్టర్ల చేత పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాల న్నింటిని గుర్తించి వారి బంధువులకు అప్పగించాలని, మృతదేహాలను అప్పగించేంత వరకు వాటిని భద్రపరచాలని చెప్పింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.