నిన్న మంత్రి కేటీఆర్..! ఇవాళ ఎంపీ క‌విత‌..!!

నిన్న కేటీఆర్, ఇవాళ ఎంపీ క‌విత తండ్రిని వెన‌కేసుకొచ్చారు. సీఎం కేసీఆర్ ప్ర‌ధానినుద్దేశించి వాడిన ప‌ద‌జాలం పెద్ద దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై బీజేపీ నేత‌లు సీరియ‌స్ గానే స్పందించారు. కేంద్ర మంత్రులు కూడా సీఎం కేసీఆర్ ప్ర‌ధాని గురించి అలా మాట్లాడ‌టంపై గుర్రుగా ఉన్నారు. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతార‌మ‌న్ కు మంత్రి కేటీర్ స‌ర్థి చెప్పిన విష‌యం తెలిసిందే. ఎంపీ క‌విత కూడా ప్ర‌ధానిని అవ‌మాన ప‌రిచే ఉద్దేశం కేసీఆర్ కు లేదంటూ చెప్పుకొచ్చారు.

మోడీ గాడు అనే మాట కేవలం దొర్లిన తప్పిదం మాత్రమేన‌ని, ప్రధానమంత్రిని అవమానపర్చాలనే సంకుచిత ఉద్దేశం కేసీఆర్ కు లేద‌ని అన్నారు ఎంపీ క‌విత‌. దేశ ప్రధానిని అవమానించుకుంటే దేశాన్ని అవమనించినట్లేన‌ని అన్నారు. చిన్న పొరపాటు దొర్లి నందుకు బిజెపి అనవసర రాద్దాంతం చేస్తోంద‌ని,దేశంలో ఉన్నది 130కోట్ల మంది మాత్రమే ఉంటే దావొస్ లో 600కోట్ల మంది నాకు ఓటు వేశారని ప్రధాని తప్పు మాట్లాడరని ఆమె గుర్తు చేశారు. ఇలా మాట దొర్లడం అందరికీ అవుతుందని చెప్పుకొచ్చారు.

రైతుల కష్టాల పట్ల అవేదనతోనే సీఎం కెసిఆర్ కాస్త కటువుగా మాట్లాడారని ఆమె అన్నారు. రైతు బడ్జెట్ అని చెప్పి కేంద్రం రైతులకు కేటాయించింది ఏం లేదని విమ‌ర్శించారు.