ప‌వర్ స్టార్ కు ధైర్యాన్నిచ్చిన కేసీఆర్ మాట‌లు !!

జ‌న‌సేన అధినేత , ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాజ‌కీయాల‌పై స్పీడ్ పెంచారు. కేంద్రం హోదా ఇస్తారో లేక ఇవ్వ‌రో తెగేసి చెప్పాలని అన్నారు. హోదాపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానంటూ, ఏపీ ప్ర‌జ‌ల త‌రుపున ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

తెలంగాన సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌లు త‌న‌లో ధైర్యాన్ని నింపాయ‌న్నారు ప‌వ‌న్. ఎక్కడున్నా తెలుగువారందరూ ఒక్కటేన్నారు ప‌వ‌న్. యువత ఆవేదనతో, బాధతో ఉన్నారని,హోదాకు మద్దతు తెలిపినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు జ‌న సేనాని.