‘ఏపీలో భాజాపా ఖాళీ’ చేయించే ప్రయత్నంలో చంద్రబాబు.. !

విభజన పుణ్యమా అని తెలుగు రాష్ట్రం ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేష్’ని ముక్కులు చేసిన కాంగ్రెస్ ని బద్ద శత్రువుగా భావించిన ఏపీ ప్రజలు 2014 సాధారణ ఎన్నికల్లో ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కాంగ్రెస్ కు దక్కకుండా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఏపీలో బీజేపీ పరిస్థితి ఇలాగే కానుంది. ఆ ప్రయత్నంలోనే ఏపీ ముఖ్యమంత్రి ఉన్నట్టు స్పష్టమైంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని భాజాపా అధిష్టానం ఏనాడో స్పష్టం చేసింది. అయినా.. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అంటూ కాలం గడుపుకొంటూ వచ్చారు. చివరకు ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని తెలిసినా ఎన్డీయే నుంచి బయటికొచ్చేందుకు బాబు ససేమిరా అన్నారు. ఇప్పుడు అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత కూడా టీడీపీ ఎన్ డీయే నుంచి బయటికొచ్చేందుకు పెద్దగా ఉత్సాహాన్ని చూపడం లేదు. ఐతే, ఈ క్రమంలో బీజేపీని ఏపీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది.

ముందుగా కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న టీడీపీ ఎంపీలు సుజనా, అశోక్ గజపతిరాజులు తమ మంత్రి పదవులకి రాజీనామాలు చేయనున్నారు. ఐతే, ఎన్ డీయే నుంచి టీడీపీ పూర్తిస్థాయిలో బయటకురాలేదు. ఇక్కడే బాబు సూక్ష్మ బుద్ది ఉంది. ఏపీ ప్రజల ముందు బీజేపీని పూర్తి స్థాయిలో బదనాం చేసేందుకు ఈ ఎత్తుగడ పనికొస్తుంది. అదీగాక, ఏపీ ప్రజల ఆకాంక్షని భాజాపా ఎంత చులకనగా చూస్తుందన్నది ప్రతి సామన్యుడుకి అర్థమవుతోంది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో బీజీపీ ఒంటిరిగా వెళ్లిన పెద్దగా లాభం ఉండదు.

ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ ఖతం అయ్యింది. ఇప్పుడు బాబు ప్రయత్నాలతో బీజేపీ ఆ స్థాయికి చేరుకోవడం ఖాయం. ఇక, ఏపీలో 2019 సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యే ప్రధాన పోటీ. టీడీపీ, వైసీపీ, జనసేన లు తమ అదృష్టాన్ని పరిక్షీంచుకోనున్నాయి. మొత్తానికి.. ఓపికలోనూ చంద్రబాబు వ్యూహం అదుర్స్ కదూ.. !