జనసేన సరికొత్త నినాదం.. !!
జనసేన పార్టీ సరికొత్త నినాదాన్ని ముందుకు తీసుకు వచ్చింది. పార్టీ ఆవిర్భవించి ఏడా ది కావస్తున్న సందర్భంగా ఆవిర్భావ వేడుకలను ఓ రేంజ్ లో నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 14న ఆవిర్భావ వేడకల నేపథ్యంలో జనసేన ప్రచార పోస్టర్ ను రిలీజ్ చేశారు పవన్. రొటీన్ కు భిన్నంగా పోస్టర్లపై సరికొత్త నినాదం, సిద్ధాంతాలను ప్రచురించారు పోస్టర్లలో.
రెండు రకాల పోస్టర్లను విడుదల చేసింది జనసేన. త్యాగధనులకు వందనం అంటూ పవన్ నమస్కరిస్తున్న చిత్రం ఒకవైపు మరో వైపు బూర్గుల రామకృష్ణారావు, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు చిత్రాలను ముద్రించారు. ఇరు తెలుగురాష్ట్రలకు సంబంధించి తెలుగు ప్రజల పార్టీ అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు.
మరో పోస్టర్ లో జనసేన పార్టీ సిద్ధాంతాలు , నినాదాలను ముద్రించారు. గుంటూరులో ఆవిర్భావ దినోత్సవం జరిగే స్థలం , పదం కలపాలి సేన, కదం తొక్కాలి సేన.. అంటూ జనసేన సింబల్ కు అటూ ఇటూ నినాదం ముద్రించారు. కుల, మతాలు లేని రాజకీయం, భాష, సంస్కృతులను గౌరవించే సంప్రదాయం, సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని కాపాడే అభివృద్ది అంటూ మరో పోస్టర్ లో ముద్రించారు.