రంభకు కమెడియన్ సరిపోతాడా.. ?

ఒక‌ప్ప‌టి గ్లామ‌ర్ హీరోయిన్ రంభ రీ-ఎంట్రీకి రెడీ అయ్యింది. గ్లామ‌ర్ హీరోయిన్’గా టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ జతకట్టింది రంభ. ఐతే, వివాహం త‌ర్వాత ఆమె సినిమాకు దూరమైంది. ప్రస్తుతం బుల్లితెరపై కనిపిస్తోంది. ఇటీవలే మళ్లీ సినిమాల్లో నటించాలన్న తన కోరికని బయటపెట్టింది.. ఈ సీనియర్ హీరోయిన్. ఇంతలోనే ఆమెకు ఓ ఆఫర్ తలుపుతట్టింది.

ఈశ్వ‌ర‌రెడ్డి దర్శకత్వంలో స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రంభని తీసుకొన్నట్టు సమాచారమ్. స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన రంభను కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరి ఏం తట్టుకొంటాడనే టాక్ సోషల్ మీడియాలో మొదలైయ్యింది. తెరపై రంభ కనిపిస్తే ఫోకస్ అంతా ఆమె పైనే ఉంటుంది. మరీ.. ఫోకస్ ని సప్తగిరి ఎలా డీల్ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.