చంద్రబాబుకు టైమిచ్చిన జగన్.. !
ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టైమివ్వడం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో మాట తప్పిన కేంద్రంపై టీడీపీ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న టీడీపీ ఎంపీలు సుజనా, అశోక్ గజపతిరాజులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు. ఐతే, కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకొని, ఎన్డీయేలో టీడీపీ ఇంకా కొనసాగుతుండటంపై విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి.
దీనిపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మండిపడ్డారు. అంతేకాదు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణం పెట్టే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు టైమిచ్చారు. ఈ నెల 21న వైసీపీ అవిశ్వాస తీర్మాణం పెట్టబోతుంది. ఈ విషయంలో మాకు సపోర్టు ఇచ్చిన సరే.. లేదంటే స్వయంగా మీరే అవిశ్వాస తీర్మాణం పెట్టినా తాము మద్దతు ఇస్తామని తెలిపారు జగన్. అంతేకాదు.. మార్చి 25న వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయబోతున్నారు. మాతో పాటుగా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు.
మరీ.. జగన్ ఇచ్చిన టైమ్ కు చంద్రబాబు ఓకే అంటారా ? లేదంటే ఆయనే స్వయంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మాణానికి పూనుకొంటారా.. ?? అనేది అసక్తిగా మారింది. మొత్తానికి.. జగన్ చంద్రబాబుకు టైమివ్వడం అనే పాయింట్ ని వైసీపీ శ్రేణులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.