హ‌రీష్’ను చంప‌డానికి వాళ్లిద్ద‌రూ కంక‌ణం క‌ట్టుకున్నారు…!! : రేవంత్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచ‌న‌ల ఆరోప‌ణ‌లు చేశారు. హుజూరాబాద్ లో జ‌రిగిన కాంగ్రెస్ స‌భ‌లో ఈటెల పై తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకుంటూనే మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. హరీష్ రావు నువ్ టిఆర్ఎస్ లో ఉంటే ఆయ‌న్ను చంప‌డం ఖాయ‌మ‌ని, కేసీఆర్, కేటీఆర్ అత‌న్ని చంప‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

హ‌రీష్ ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు దూకాల‌ని ఆయ‌న అన్నారు. హరీష్ రావు పార్టీ ని ఫిరాయించి కాంగ్రెస్ లో చేరేందుకు ఆనాడే వైఎస్ తో చర్చలు జరిపారని, టిఆర్ఎస్ ను పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హరీష్ రావు వైఎస్ సన్నిహితునితో చర్చలు జరిపారని ఆయ‌న గుర్తు చేశారు. అయితే వై ఎస్ మరణంతో టిఆర్ఎస్ విలీనం ఆగిపోయిందని చెప్పారు.

బీజేపీలో కీల‌క‌మైన వ్య‌క్తి బంధువుతో పార్టీలో చేరేందుకు హ‌రీష్ రావుతో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది నిజం కాదా అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ విష‌యాన్ని హ‌రీస్ బామ్మ‌ర్థి కేటీఆర్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్న‌ది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారాయ‌న‌. హరీష్ రావు ఎవరికి వివరణ ఇస్తున్నారు.. మామకా, బామ్మర్ది కా.. అంటూ ఎద్దేవా చేశారు. హరీష్ రావు ప్రజలకు వివరణ ఇవ్వ వలసిన అవసరం ఏముందని, ఇంట్లోనే మామకు వివరణ ఇచుకోవచ్చు కదా అని ఆయ‌న అన్నారు.

పార్టీలో హరీష్ రావు పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్థం అయిందని, హరీష్ రావు రహస్యంగా అమిత్ షా ను రెండు సార్లు ఎందుకు కలిశారో చెప్పాల‌ని అన్నారు రేవంత్. టిఆర్ఎస్ పార్టీ చీలిపోవడం ఖాయమ‌ని ఆయ‌న అన్నారు.