భరత్ అను నేను.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నా.. !

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం “భరత్ అను నేను”. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ – కొరటాల కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో భరత్.. ‘శ్రీమంతుడు’ని అంతకుమించిన హిట్ ఇస్తుందని చెప్పుకొంటున్నారు. భరత్.. హవా చూస్తుంతే ఇదీ నిజమే అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భరత్.. రికార్డు స్థాయిలో రిలీజ్ కాబోతున్నాడు. ఇదీగాక, బాహుబలి రేంజ్ లో భరత్.. ప్రీమియర్ షోస్ పడనున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 థియేటర్స్ లో భరత్.. ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఒక్క యుఎస్ లోనే 1000 థియేటర్స్ లో ప్రీమియర్ షోస్ ని ప్లాన్ చేశారు. ఈ లెక్కన అక్కడ మొదటి వారంలోనే భరత్.. కలెక్షన్స్ 3మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేలా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ‘రంగస్థలం’ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు భరత్.. టార్గెట్ ‘రంగస్థలం’గా మారింది. మరీ.. భరత్ హవా ముందు రంగస్థలం రికార్డులు బ్రేక్ అవుతాయో చూడాలి.

బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు మహేష్ ఫ్యాన్స్ దాహాన్ని పూర్తి స్థాయిలో తీర్చలేకపోయాయి. ఇప్పుడు భరత్.. పైనే ప్రిన్స్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకొన్నారు. భరత్.. బ్లాక్ బస్టర్ హిట్ అయితే ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. ఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ జతకట్టనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. డి.వి.వి దానయ్య నిర్మాత.