సూర్యలో గోనగన్నారెడ్డి..!

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. ఈ శుక్రవారం (మే 4) ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో బన్నీ జవాన్ గా కనిపించబోతున్నాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. బన్నీ సరసన అను ఇమ్మాన్యూయేల్ జతకట్టనుంది.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూర్య గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సూర్యలో రెండున్నర గంటల గోనగన్నారెడ్డి చూడబోతున్నారని తెలిపాడు. గుణశేఖర్ ‘రుద్రమదేవి’లో గోనగన్నారెడ్డి పాత్ర హైలైట్’గా నిలిచిన సంగతి తెలిసిందే.

గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులచే ఈలలు, కేకలు వేయించింది. ఓ చిన్ని పాత్ర సినిమాకే ప్రధాన బలంగా మారింది. ఏన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘నా పేరు సూర్య’లోనూ బన్నీలో గోనగన్నారెడ్డి పవర్ చూస్తారని చెప్పి అభిమానులని సంతోష పెట్టాడు చరణ్. మరీ.. ఆయన మాటల్లో నిజమెంత ? అనేది ఈ శుక్రవారం తెలియనుంది.