రజనీకాంత్ ఇంట్లో బాంబు..?!

చెన్నైలోని సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసముండే ఇంట్లో బాంబు పెట్టినున్నట్లుగా ఓ అగంత‌కుడి నుంచి ఫోన్ బెదిరింపు వచ్చింది. రజనీకాంత్‌తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసాల వద్ద బాంబులు పెడతానని బెదిరిస్తూ ఒక వ్యక్తి పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్ చేశాడు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు రంగంలోకి దిగారు. ర‌జ‌నీకాంత్, ప‌ళ‌నిస్వామి ఇంట్లో సోదాలు చేప‌ట్టారు.

బాంబ్ స్క్వాడ్ త‌నిఖీలు చేప‌ట్ట‌డంతో పాటు, ఆ ఫోన్ కాల్ ఎక్క‌డినుంచి వ‌చ్చిందో ట్రేస్ ఔట్ చేసే ప‌నిలో ప‌డ్డారు చెన్నై పోలీసులు. బెదిరింపుల‌కు పాల్ప‌డిన వ్య‌క్తి ఎవ‌రో ప‌ట్టుకోవ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌తంలోనూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వ‌చ్చినా, ర‌జినీ రాజ‌కీయాల్లోకి రాబోతున్న ఈ త‌రుణంలో ఇలాంటి బెదిరింపులు రావ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.