భాజాపా ‘కాపు’ కాస్తోంది

ఆంధ్రప్రదేష్ రాజకీయాలు అంటేనే ‘కాపు వర్సెస్ కమ్మ’ అన్నసంగతి తెలిసిందే. అధికంగా ఉన్న కాపులు ఎటు ఒరిగితే వారిదే విజయం. ఈ విషయం తెలిసే రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ ‘కాపు’ కాస్తుంటాయి. కాపు నేతలకు పెద్ద పీఠ వేస్తుంటాయి. ఇప్పుడు ఏపీ భాజాపా కూడా అదే చేసింది. ఏపీ భాజాపా నూతన అధ్యక్షుడుగా కాపు నేత కన్నా లక్ష్మీనారాయణనని నియమించింది.

ముందు నుంచి ఏపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న సీనియర్ నేత సోము వీర్రాజుని కాదని కన్నాకు అధ్యక్ష కిరీటం కట్టబెట్టడం వెనక కాపు కార్డునే పనిచేసింది. కాపు కార్డు సోము వీర్రాజు, పురంధేశ్వరినీ కాదని కన్నాకు పదవిని తెచ్చిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది అక్షరాల నిజమని ప్రతి ఆంధ్రుడు ఒప్పుకొంటున్నాడు.

కాపు కార్డు పవర్ విషయం ప్రక్కన పెడితే.. ఏపీ భాజాపాలో కన్నా కలకలం మొదలైంది. తనకు అధ్యక్ష పదవి దక్కకపోవడంతో కినుకు వహించిన సోము అజ్ఝాతంలోకి వెళ్లిపోయాడు. ఆయనకు మద్దతుగా పలువురు జిల్లా భాజాపా అధ్యక్షులు, భాజాపా ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరీ.. పరిణామాలని కొత్త ఏపీ భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎలా దారిలోకి తెస్తాడనేది చూడాలి.