చరణ్’తో ‘ఇంద్ర 2’ తీస్తున్నాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన అభిమానుల దాహాన్ని ‘రంగస్థలం’ పూర్తిస్థాయిలో తీర్చింది. ‘మగధీర’ని మించిన హిట్’ని అందించింది. నాన్ బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్’ని మెగా ఫ్యామిలీ గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకొన్నట్టు కనబడింది. కొన్నాళ్ల క్రిందటే సెలబ్రేషన్స్ ముగిశాయి. దీంతో రామ్ చరణ్ బోయపాటి సినిమా షూటింగ్’లో జాయిన్ అయిపోయాడు.

బోయపాటికి మాస్.. ఊరమాస్ దర్శకుడు అనే పేరుంది. ఆయన సినిమాల్లో యాక్షన్ అదిరిపోయే రేంజ్’లో ఉంటుంది. చరణ్ సినిమాలోనూ ఆ రేంజ్ మాస్, మసాల, యాక్షన్ ఉండబోతుందట. ఐతే, ఈ సినిమా లైన్ మెగాస్టార్ ‘ఇంద్ర’ సినిమాని పోలి ఉన్నట్టు కనబడుతోంది. సొంత ఊరికి దూరంగా ఉండే హీరో. ఆయన ఎందుకు ఊరికి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది. ప్లాష్ బ్యాక్ లో సమస్యలేంటీ ? అనే లైన్ తో చరణ్ సినిమా తెరకెక్కుతుందట.

ఈ లైన్ మెగాస్టార్ ‘ఇంద్ర’ సినిమాని పోలి వున్నట్టు అనిపిస్తోంది. దీంతో.. బోయపాటి – చరణ్ సినిమా ‘ఇంద్ర 2’ అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ? అనేది చిత్రబృందం క్లారిటీ ఇస్తే అభిమానుల్లో నెలకొంది కన్ఫూజన్ కి చెక్ పెట్టినట్టు అవుతుంది.