‘టాక్సీవాలా’ లేటుగా వస్తాడట

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో క్రేజ్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహానటి’ సావిత్రి బయోపిక్ లో కీలక పాత్రలో కనిపించాడు. ఇప్పుడీ సినిమా జైత్రయాత్ర కొనసాగుతోంది.ఈ సమయంలోనే విజయ్ దేవరకొండ ‘టాక్సీవాల’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. ఈ నెల18న ‘టాక్సీవాల’ రిలీజ్ డేటుని ప్రకటించారు. ఐతే, ఇప్పుడీ సినిమా విడుదలని వాయిదా వేశారు.

ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ నెల 18న ‘టాక్సీవాల’ రిలీజ్ కావడం లేదు. జూన్ లో రిలీజ్ చేస్తాం. త్వరలో కొత్త రిలీజ్ డేటుని చెబుతామని ట్విట్ చేశాడు విజయ్. సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కిన చిత్రమిది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు. మాళవిక శర్మ, ప్రియాంక హీరోయిన్లు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు.