కర్ణాటక రిజల్ట్’తో కేసీఆర్ అలర్ట్ !

కర్ణాటక ఫలితంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్ట్ అయినట్టు కనబడుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో మరోమారు తెరాస విజయంపై కేసీఆర్ ధీమాగా ఉన్నారు. తెలంగాణ పల్లె పల్లెన మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతటి పాజిటివ్ మూమెంట్’లోనూ కర్ణాటకట ఫలితం కేసీఆర్ ని అలర్ట్ అయ్యేలా చేసిందని చెబుతున్నారు.

తెలంగాణలోనూ వచ్చే సాధారణ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. టీఆర్ఎస్ భావిస్తున్నట్టు విజయం నల్లేరుపై నడకేం కాదు. మునుపటితో పోలిస్తే ఈసారి కాంగ్రెస్సోళ్లకి కొన్ని సీట్లు పెరుగుతాయనే టాక్ వినిపిస్తోంది. దీనికితోడు కొత్తగా పుట్టుకొచ్చిన కోదండరాం (టీజేఎస్) పార్టీ బలాన్ని ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ఈ పార్టీ ఎన్ని సీట్లు గెలవగలదనే సంగతి ప్రక్కన పెడితే.. అధికార పార్టీ (టీఆర్ఎస్) ఓటు బ్యాంకుని కొద్దిగా చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మొత్తం ఫలితాన్నే ప్రభావతం చేసే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే.. మొదటికే మోసం జరగొచ్చు.

ఇక, సీఎం కేసీఆర్ ఢిలీని లక్ష్యంగా చేసుకొన్నారు. ఇప్పటికే థర్డ్ ఫ్రెంట్ కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ అయ్యారు కూడా. ఐతే, కేసీఆర్ భేటీ అయిన నేతలు కర్ణాటక ఫలితాల సమయంలో రియాక్ట్ అయిన తీరు కేసీఆర్ కు షాక్’నిస్తున్నాయి. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ జతకట్టాలని ప.బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయవతి.. తదితరులు సూచించారు.

కేసీఆర్ పెట్టబోయే థర్డ్ ఫ్రెంట్’లో చేరబోయే పేర్లలో మమత, మాయ పేర్లు వినిపించారు. ఇప్పుడు వీరిద్దరు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ డబ్బు కొడుతున్నట్టు కనబడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ కేసీఆర్ అలర్ట్ కావాల్సిన ఆవశ్యకతని చూపిస్తున్నాయి. ఇదీగాక, తెలంగాణలో కాంగ్రెస్, టీజేఎస్, భాజాపా, ఎంఐఎంలలో ఏ పార్టీ ఊహించని సీట్లు గెలిచిన కేసీఆర్ కు ఢిల్లీ పీఠం కాదు కదా.. తెలంగాణ పీఠం చేజారే ఛాన్స్ ఉంది. అలాగని కేసీఆర్ ని తక్కువ అంచన వేయలేం. ఆయన అస్త్రాలు ఆయనకుంటాయ్.. మరీ!